ఎవడవురా నీవు
ఎవడవురా నీవు
ఈదీ అమీనువా
అడాల్ఫ్ హిట్లరువా
ప్రజాస్వామ్యమంటవ్
పరిహసిస్తవేందిరా
ఏమడిగిండ్రురా
ఏమన్నరురా
నీ భూములడిగిండ్రా
నీ సెజ్జులడిగిండ్రా
మా భూములు మాకే అన్నరు
దానికే సంపుతావురా
వాళ్ళ భూములపై నీ జులుం ఏందిరో
వాళ్ళ ఊరోనివా
వాళ్ళ పైన దొరోనివా
అడగకుండనే ఇయ్యాల్సినోనివి
అడిగినంకగూడ ఏదీ ఇయ్యవ్
వాళ్ళ ప్రాణాలైతే తీస్తవురా
ఎవడిచ్చిండ్రా నీకా హక్కు
ఆయువంటే అంత అల్కనైందిరా నీకు
ఇగనైనా తోకముడువు బిడ్డా
లేకుంటే.....
గిరిజనులే అమీనులైతరు
జాలర్లే హిట్లర్లయితరు కొడకా

A serious warning to the so called capitalists, who are looting the poor.
ReplyDelete