Monday, February 28, 2011

ఎవడవురా నీవు

ఎవడవురా నీవు
ఈదీ అమీనువా
అడాల్ఫ్ హిట్లరువా
ప్రజాస్వామ్యమంటవ్
పరిహసిస్తవేందిరా
ఏమడిగిండ్రురా
ఏమన్నరురా
నీ భూములడిగిండ్రా
నీ సెజ్జులడిగిండ్రా
మా భూములు మాకే అన్నరు
దానికే సంపుతావురా
వాళ్ళ భూములపై నీ జులుం ఏందిరో
ఎవడవురా నీవు
వాళ్ళ ఊరోనివా
వాళ్ళ పైన దొరోనివా
అడగకుండనే ఇయ్యాల్సినోనివి
అడిగినంకగూడ ఏదీ ఇయ్యవ్
వాళ్ళ ప్రాణాలైతే తీస్తవురా
ఎవడిచ్చిండ్రా నీకా హక్కు
ఆయువంటే అంత అల్కనైందిరా నీకు
ఇగనైనా తోకముడువు బిడ్డా
లేకుంటే.....
గిరిజనులే అమీనులైతరు
జాలర్లే హిట్లర్లయితరు కొడకా

Monday, February 21, 2011

రగులుతున్న రాజధాని

ధౌర్భాగ్యపు సర్కారు

అసెంబ్లీలో గవర్నర్ ను అడ్డుకోవచ్చు

విద్యార్థులు మాత్రం అసెంబ్లీకే రారాదు

జేపీ సాబ్ కు అక్కడ రాజ్యాంగ ఖననం

ఇక్కడ హక్కల హననం కానరాదు

కనిపిస్తలేదా మీ పక్షపాతం

దెబ్బకు రాలేదా పాలనకు పక్షవాతం

ఎందుకురా పానాలు తీస్తరు

నాలుగు కోట్ల దేవతలు శపిస్తున్నరు